రేపు విశాఖలో సీఎం జగన్ పర్యటన

శ్రీ శారదాపీఠం వార్షికోత్సవ కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం

AP CM YS Jagan
AP CM YS Jagan

అమరావతిః సిఎం జగన్‌ రేపు విశాఖలో పర్యటించనున్నారు. తన పర్యటన సందర్భంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రేపు ఉదయం 9.15 గంటలకు ఆయన తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరుతారు. ఉదయం 10.30 గంటలకు ఆయన విశాఖ చేరుకుంటారు. తొలుత ఆయన శ్రీ శారదా పీఠానికి వెళ్తారు.

శారదాపీఠం వార్షికోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత మధ్యాహ్నం 12.30 గంటలకు అక్కయ్యపాలెం సాగరమాల కన్వెన్షన్ హాల్ కు చేరుకుని అనకాపల్లి ఎంపీ సత్యవతి కుమారుడు డాక్టర్ యశ్వంత్, డాక్టర్ స్రవంతి దంపతులను ఆశీర్వదిస్తారు. అనంతరం 1.30 గంటలకు విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నివాసానికి చేరుకుని ఆయన కుమారుడు శరత్ చౌదరి, జ్ఞానిత దంపతులకు శుభాకాంక్షలు తెలపనున్నారు. ఆ తర్వాత ఐపీఎస్ అధికారి విద్యాసాగర్ నాయుడు, భవ్య దంపతులను ఆశీర్వదించనున్నారు. అనంతరం తాడేపల్లికి తిరుగుపయనమవుతారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండిః