తొలిసారిగా కియా కంపెనీకి సిఎం జగన్‌

CM Jagan
CM Jagan

అనంతపురం: కియా మోటార్స్ కంపెనీ గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమానికి సిఎం జగన్ ఈ నెల 5వ తేదీ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా సిఎం రాకపై చేయాల్సిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ చంద్రుడు సమీక్ష నిర్వహించారు. కియా కంపెనీ లీగల్ హెడ్ జుడ్, జిల్లా ఎస్పీ ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ కార్యమ్రంలో భాగంగా ప్లాంట్ టూర్, ఓపెనింగ్ సెర్మనీ కార్యక్రమాలు ఉంటాయని తెలుస్తోంది. సిఎం జగన్ అనంతపురం రాక సందర్భంగా పుట్టపర్తి విమానాశ్రయం, కియా కంపెనీలో కార్యక్రమాల ఏర్పాట్లను పర్యవేక్షించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ భద్రతా పరమైన అంశాలను ఎస్పీతో చర్చించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/