కొత్త జిల్లాల ఏర్పాటుపై సమీక్ష నిర్వహించనున్న సీఎం జగన్

అమరావతి: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు రంగం సిద్ధమవుతోంది. జిల్లాల పునర్విభజన అంశంపై సీఎం జగన్‌ బుధవారం సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కొత్త జిల్లా కేంద్రాల్లో ఏర్పాట్లు, ఉద్యోగుల కేటాయింపుపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.

కాగా, రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాలని పాలనా సౌలభ్యానికి తగ్గట్టుగా ఉగాది నాటికి అంటే కొత్త తెలుగు సంవత్సరాదికి సిద్ధం చేయాలని గతంలో సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 2 నుంచి ఏపీలో 26 జిల్లాల నుంచి పరిపాలన ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/