‘వైఎస్‌ఆర్‌ బీమా’ పథకం ప్రారంభించిన సిఎం జగన్‌

cm-jagan-launches-ysr-bheema-scheme

అమరావతి: ఏపి సిఎం జగన్‌ గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘వైఎస్‌ఆర్‌ బీమా’ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా బియ్యం కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరనుంది. కుటుంబ పెద్దకు జీవన భద్రత కల్పించేందుకు తీసుకొచ్చిన ఈ బీమా పథకం ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. కోవిడ్‌ వల్ల ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ నిరుపేద కుటుంబాలకు మేలు చేయాలన్న సంకల్పంతో వైఎస్‌ఆర్‌ బీమా పథకాన్ని అమలు చేసినట్టు సిఎం జగన్‌ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నిరుపేదల కోసం వైఎస్‌ఆర్‌ బీమా పథకం తెచ్చాం. కేంద్రం తప్పుకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వమే ప్రీమియం భరిస్తుంది. ఏడాదికి రూ.510 కోట్లు ప్రీమియం చెల్లిస్తున్నాం. ఈ పథకంతో 1.41 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. గ్రామ సచివాలయాల్లో ఇన్సూరెన్స్‌ జాబితా పెడతాం. ప్రమాదాల్లో మరణించిన, వైకల్యం కలిగిన కుటుంబాలకు బీమా కవరేజీ ఉంటుంది. 1850 ఏళ్ల మధ్య వారు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5లక్షలు బీమా. సహజ మరణానికి రూ.2లక్షల బీమా. ప్రమాదవశాత్తు పాక్షిక వైకల్యం కలిగితే రూ.1.50 లక్షల బీమా. 5170 ఏళ్ల మధ్య ఉన్నవారు మరణిస్తే రూ.3లక్షలు బీమా. ప్రమాదవశాత్తు చనిపోయినవారి కుటుంబాలకు తక్షణం రూ.10వేలు అందిస్తాం. గ్రామ సచివాలయం నుంచే రూ.10వేలు ఇస్తాం అని సిఎం పేర్కొన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/