నేడు అమరావతిపై కీలక నిర్ణయం తీసుకోనున్న జగన్

అమరావతి: ఏపి సిఎం జగన్ రాజధానిని అమరావతి నుంచి మారుస్తారనే ప్రచారం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. పలువురు ఏపీ మంత్రులు, వైఎస్ఆర్సిపి నేతలు ఈ అంశంపై పరోక్షంగా సంకేతాలు ఇవ్వడం జనాల్లో ఆందోళనను పెంచింది. అయితే, ఈ అంశంపై ముఖ్యమంత్రి జగన్ ఇంత వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈరోజు ఈ అంశంపై జగన్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సీఆర్డీఏ అధికారులతో జగన్ ఈరోజు సమీక్ష నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో, సీఎం మనసులో ఏముందనే విషయం ఈరోజు బహిర్గతంకానుంది. రాజధానిగా అమరావతి కొనసాగుతుందా? లేదా? అనే ప్రశ్నకు సమాధానం దొరికే అవకాశం ఉంది. మరోవైపు, రాజధానిని మార్చకూడదని విపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telengana/