తిరుపతి పర్యటనకు బయల్దేరిన సీఎం జగన్

రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్‌

తిరుమల : సీఎం జగన్ రెండు రోజుల తిరుమల పర్యటన నిమిత్తం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి, ఎంపీలు రెడ్డప్ప, డాక్టర్‌ గురుమూర్తి సీఎంకు స్వాగతం పలికారు. సీఎం జగన్ రేణిగుంట నుంచి తిరుపతి బర్డ్‌ ఆస్పత్రికి చేరుకుని.. అక్కడ నిర్మించిన శ్రీపద్మావతి చిన్న పిల్లల కార్డియాక్‌ సెంటర్‌ను సీఎం ప్రారంభిస్తారు.

అనంతరం అలిపిరి వద్దకు చేరుకుని శ్రీవారి పాదాల వద్ద నుంచి తిరుమలకు నడక మార్గం, పై కప్పును, గోమందిరాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రం తిరుమలలోని బేడి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుని స్వామి దర్శనం చేసుకుంటారు. అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకుని స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. స్వామివారి దర్శనం అనంతరం ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారు. తర్వాత పద్మావతి అతిథి గృహానికి చేరుకుని, రాత్రికి అక్కడే బస చేస్తారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/