రైతు భరోసాను ప్రారంభించిన జగన్

రైతులకు సాయం చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నా

cm jagan
cm jagan

నెల్లూరు: ‘వైయస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్’ కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ఐదేళ్లలో వర్షాలు లేక రైతులు అల్లాడిపోయారని… రాష్ట్రమంతా ఈ సంవత్సరం మంచి వర్షాలు పడ్డాయని… రైతులను దేవుడు నిండు మనసుతో ఆశీర్వదించారని అన్నారు. పదేళ్ల తర్వాత రిజర్వాయర్లన్నీ నీటికుండలుగా మారాయని తెలిపారు. దేశంలోనే ఒక గొప్ప పథకాన్ని ఈరోజు ప్రారంభించామని… ఏ రాష్ట్రం కూడా ఇవ్వనంత ఎక్కువ పెట్టుబడి సాయాన్ని ఈ పథకం ద్వారా రైతులకు అందిస్తామని చెప్పారు. తన పాదయాత్రలో రైతుల ఆవేదనను చూశానని… రైతులకు సాయం చేయడాన్ని తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చానని చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/