ప్రభుత్వానికి మంచి పేరొస్తుందని బాబుకు ఈర్ష్య

చరిత్రాత్మక బిల్లులు సభలో ప్రవేశపెట్టాం

cm jagan
cm jagan

అమరావతి: ఏపి అసెంబ్లీలో ఈరోజు సమావేశాలు ప్రారంభం అయిన తర్వాత మొదట పెన్షన్లపై చర్చసాగింది. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్షాల సభ్యుల మధ్య మాటల యుద్ధం నెలకొంది. అనంతరం సిఎం జగన్‌ మాట్లాడుతు అసెంబ్లీలో చరిత్రాత్మక బిల్లులు సభలో ప్రవేశపెట్టామని ఆయన అన్నారు. ఈ బిల్లుతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని అయితే టిడిపి అధినేత చంద్రబాబు ఈర్ష్యతో ఏం చేస్తున్నారో అందరూ చూస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేటెడ్‌ పదవులు, నామినేషన్‌ వర్క్స్‌లలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అయితే ఈ బిల్లులు రాకుండా అడ్డుకునే దుర్భుద్దితో ఉన్నారన్నారు. ప్రతి నియోజకవర్గంలో తాను చెప్పిందే మేనిఫెస్టోలో పెట్టామన్నారు.బాబు ఏనాడూ బీసీలు, ఎస్సీలు, మైనార్టీల గురించి ఆలోచించలేదు. మేనిఫెస్టోలో చెప్పినట్లే బిల్లులు తీసుకొస్తున్నాం. ఎక్కడ మా ప్రభుత్వానికి పేరొస్తుందా అని బాబుకు భయం. నామినేటెడ్ పదవుల్లోనూ, నామినేషన్ పనుల్లోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నాం. దేశంలో, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నామినేటెడ్ పోస్టుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నాం అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/