కోర్దు విచారణకు సీఎం జగన్‌ సహకరించాలి

varla ramaiah
varla ramaiah

గుంటూరు: అక్రమాస్తుల కేసుల విచారణకు సీఎం జగన్‌ సహకరించాలని టిడిపి సీనియర్‌ నేత వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు. ఈ రోజు గుంటూరులో ఆయన మీడియాతో మాట్లడుతూ..అక్రమాస్తుల కేసులో ప్రతి శుక్రవారం జగన్‌ కోర్టుకు వెళ్లాల్సి ఉంది కాబట్టి శుక్రవారం వాయిదా వేయకుండా తప్పకుండా వెళ్లి కడిగిన ముత్యంలా, బయటకు వస్తానని, తనపై వచ్చినవన్నీ ఆరోపణలు మాత్రమేనని దమ్ముంటే జగన్‌ నిరూపించుకోవాలని వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి విచారణకు వెళ్తే ప్రభుత్వ పాలన కొనసాగదని వంకలు చెప్పకుండా కావాలంటే శుక్రవారం తనకు బదులుగా ఆయన మరొక నేతను తన ప్రతినిధిగా శుక్రవారం సీఎంగా నియమించాలని సవాలు విసిరారు. ఇంకా తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌..జగతి పబ్లికేషన్‌కు చెందిన ఓ పత్రికలో 834 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. పత్రికా రంగంలో ప్రపంచంలో ఒక పారిశ్రామిక వేత్త ఇంత భారీ పెట్టుబడులు పెట్టిన దాఖలాలు ఎక్కడ లేవు అని వర్ల రామయ్య ఆరోపించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/