స్పందన కార్యక్రమంపై సిఎం సమీక్ష

AP CM YS JAGAN
AP CM YS JAGAN

అమరావతి: ఏపి సిఎం జగన్‌ సచివాలయంలో స్పందన కార్యక్రమంపై ఈరోజు సమీక్ష నిర్వహించారు. స్పందన కార్యక్రమంపై జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై సిఎం సుదీర్ఘంగా సమీక్షించారు. గతంలో పెన్షన్ల కంటే ప్రస్తుతం పెన్షన్లు ఎక్కువైన నేపథ్యంలో.. పెన్షన్ల పంపిణీ సక్రమంగా జరుగుతుందా.. లేదా.. అని ఆరా తీశారు. పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు అన్ని సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని సిఎంఅధికారులకు ఆదేశించారు. ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలను అందించే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నేపథ్యంలో… ఫిబ్రవరి 15 లోగా ఇళ్ల పట్టాల అర్హుల జాబితాను సిద్ధం చేయాలని సిఎం జగన్‌ ఆదేశించారు. ప్రజా సాధికార సర్వేకు, ఇళ్ల పట్టాల నిర్మాణానికి లింక్‌ పెట్టవద్దని సూచించారు. స్పందన కార్యక్రమంలో అధికారులంతా బాగా పనిచేశారంటూ.. అధికారులను సిఎం ప్రశంసించారు. ఫిబ్రవరి ఒకటి నుండి ఇంటికే వెళ్లి పెన్షన్లు అందజేయాలని సూచించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/