అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటుపై సిఎం సమీక్ష

ఎక్కడి నుంచి చూసినా విగ్రహం స్పష్టంగా కనిపించాలి..సిఎం జగన్‌

AP CM YS Jagan
AP CM YS Jagan

అమరావతి: సిఎం జగన్‌ విజయవాడ స్వరాజ్‌ మైదాన్‌లో ఏర్పాటు చేయనున్న 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. విగ్రహం ఎక్కడ ఏర్పాటుచేస్తే గ్రాండ్‌లుక్‌ వస్తుందో దానిపై దృష్టి పట్టాలని, గ్రౌండ్‌లో బెస్ట్‌ లొకేషన్‌ ఎక్కడో ఫైనలైజ్‌ చేయాలని మంత్రులకు సూచించారు. వెంటనే విగ్రహం తయారీకి ఆర్డర్‌ ఇవ్వాలని, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి కావాలని స్పష్టం చేశారు. నవంబరు 1వ తేదీన పనులు మొదలు పెట్టి 13 నెలల్లోగా పూర్తయ్యేలా చూడాలని అన్నారు. అక్కడ ఒక కన్వెన్షన్‌ హాల్‌ కూడా ఏర్పాటు చేస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా వివిధ సంస్థల ప్రతినిధులు పలు నమూనాలు ప్రదర్శించారు. విగ్రహంతో పాటు, పార్కు నిర్మాణానికి సంబంధించి వారు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌లో చూపారు.


కాగాఅంబేద్కర్‌ విగ్రహం విజిబిలిటీ ముఖ్యమని సూచించిన సిఎం జగన్… ఎక్కడి నుంచి చూసినా విగ్రహం స్పష్టంగా కనిపించాలని అన్నారు. అక్కడ నిర్మించే ల్యాండ్‌ స్కేప్‌ (పార్కు) పూర్తి ఆహ్లాదకరంగా ఉండాలని తెలిపారు. కన్వెన్షన్‌ సెంటర్, ఫుడ్‌ కోర్టు మాత్రమే కమర్షియల్‌గా ఉండాలని తెలిపారు. వీటిపై వచ్చే ఆదాయం పార్క్‌ మెయిన్‌టెనెన్స్‌కు ఉపయోగపడుతుందని అన్నారు. వీలైనంత వరకు కాంక్రీట్‌ నిర్మాణాలు తగ్గించాలని.. మంచి వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. విగ్రహం, పార్కు గ్రాండ్‌ లుక్‌ కనిపించాలని పనులు ప్రారంభించేలోగా ఆ స్ధలంలో ఉన్న ఇరిగేషన్‌ ఆఫీస్‌లు, మిగిలిన ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ వెంటనే తరలించాలని సిఎం జగన్ అన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/