ఉన్నతాధికారులతో సిఎం జగన్‌ సమీక్ష

cm jagan
cm jagan

అమరావతి: ఏపి సిఎం జగన్‌ ఉగాది రోజు పేదలకు ఇళ్లపట్టాల పంపిణీపై మంత్రులు, ఉన్నతాధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. ఉగాది రోజున ఇచ్చే ఇళ్ల పట్టాలకోసం భూముల గుర్తింపు పూర్తి కావాలని ఆదేశించారు. జిల్లాలవారీగా ఉన్నతాధికారులు పర్యటించి సమీక్ష చేయాలన్నారు. లక్ష్యాలను చేరుకున్నారా? లేదా? అన్నదానిపై సమీక్ష చేయాలని, ప్రతి జిల్లాలో కనీసం రెండు సార్లు సమీక్షలు చేయాలని సూచించారు. ప్లాట్ల మార్కింగ్‌ జరుగుతుందా? లేదా?, ఇళ్లపట్టాల కోసం గుర్తించిన భూములను సిద్ధం చేస్తున్నారా? లేదా? అన్నదానిపై సమీక్ష చేయాలన్నారు. ఇళ్ల పట్టాల కార్యక్రమం సాఫీగా సాగడానికి అవసరమైతే ప్రత్యేక బఅందాలను ఏర్పాటు చేయాలని సిఎం జగన్‌ ఆదేశించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/