ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష

అమరావతి : సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో కాంట్రాక్టు ఉద్యోగుల స్థితిగతులపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈసందర్బంగా సీఎం మాట్లడుతూ.. వివిధ ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందించాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ విభాగాలతో పాటు, వివిధ సొసైటీలు, విశ్వవిద్యాలయాల్లోని కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాల విడుదలలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా, సకాలానికే అందించాలని సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో సీఎస్ నీలం సాహ్ని, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్, జీఏడీ సర్వీసెస్ సెక్రటరీ శశిభూషణ్, కార్మిక శాఖ కార్యదర్శి ఉదయలక్ష్మి, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ మల్లికార్జున్ తదితరులు హాజరయ్యారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/