ఆర్థి కశాఖపై సిఎం సమీక్ష ప్రారంభం

cm Jagan
cm Jagan

అమరావతి: ఏపి సిఎం జగన్‌ ఆర్థిక శాఖపై సమీక్ష ప్రారంభమైంది. ఆదాయ వనరులు సమాకూర్చే శాఖలపై ఆయన సమీక్ష జరుపుతున్నారు. దాదాపు గంటకు పైగా ఈ సమావేశం జరిగే అవకాశముంది. ఈ సమీక్షలో భాగంగా పలు కీలకనిర్ణయాలు తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తుంది. సమీక్ష ముగిసిన వేంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ మీడియాతో మాట్లాడి వివరాలు వెల్లడిస్తారని సమాచారం. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు డి. సాంబశివరావు, పీవీ రమేష్, ముఖ్యకార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఆర్థిక శాఖ కార్యదర్శి ముద్దాడ రవిచంద్, ముఖ్యమంత్రి కార్యదర్శి ఆరోఖ్య రాజ్, అదనపు కార్యదర్శి ధనంజయ రెడ్డి పాల్గొన్నారు.

అంతేకాక సిఎం జగన్‌ ఈరోజు నుండి శాఖలవారీగా సమీక్షలు జరపనున్నారు. ఈరోజు ఆర్థిక, రెవెన్యూశాఖలపై.. ఈ నెల 3న ఉదయం విద్యాశాఖ, మధ్యాహ్నం జలవనరులశాఖపై సమీక్ష జరగనుంది. 4న ఉదయం వ్యవసాయ అనుబంధరంగాలపై, 4న మధ్యాహ్నం గృహనిర్మాణశాఖపై ఈ నెల 6న సీఆర్డీఏపై సీఎం జగన్‌ సమీక్షలు జరపనున్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/