మూడు విడతల్లో సర్వే చేయాలి..సిఎం జగన్‌

సమగ్ర భూ సర్వేపై సిఎం జగన్‌ సమీక్ష..అధికారులకు ఆదేశాలు

AP CM Jagan
AP CM Jagan

అమరావతి: సిఎం జగన్‌ రెవెన్యూశాఖలో భూముల రీ సర్వేపై ‌ తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా సిఎం జగన్‌ మాట్లాడుతూ..ఆలస్యం లేకుండా సమగ్ర భూ సర్వే మొదలు పెట్టి, మూడు విడతల్లో సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. ఇది అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్‌ అని, మండలాల వారీగా సర్వే చేయాలని, సర్వే హద్దు రాళ్ల ఖర్చు కూడా ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశించారు. సమగ్ర భూ సర్వే కోసం తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. గ్రామ సచివాలయాల పరిధిలో సర్వే చేస్తామని.. ఈ సర్వే సందర్భంగా ఏమైనా వివాదాలు వస్తే పరిష్కరించడానికి మొబైల్‌ కోర్టులు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. డిప్యూటీ కలెక్టర్ల స్థాయిలో మొబైల్‌ కోర్టులు నడుస్తాయని, దీంతో రికార్డుల ప్రక్షాళన అవుతుందని అధికారులు సిఎంకు తెలిపారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లం, ల్యాండ్‌ అండ్‌ ఎండోమెంట్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఉషారాణి తదితర అధికారులు పాల్గొన్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/