పోలవరం లో సీఎం జగన్ పర్యటన

అమరావతి : సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా పోలవరం చేరుకున్నారు. ముందుగా సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే ద్వారా పోలవరం ప్రాజెక్టు పనులను వీక్షించారు. అధికారులతో కలిసి సీఎం జగన్‌ క్షేత్రస్థాయిలో పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన ప్రాజెక్ట్‌ పనుల పురోగతిని ఆయన స్వయంగా పరిశీలిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పరిశీలనలో వెల్లడైన అంశాల ఆధారంగా మధ్యాహ్నం అధికారులతో సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించనున్నారు. సీఎం జగన్‌తో పాటు నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఉన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/