భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

అమరావతి : భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ కలెక్టర్లను ఆదేశించారు. వర్షాల పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు.

వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్రలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అమరావతి వాతావారణ కేంద్రం హెచ్చరించింది. రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని పేర్కొంది. కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయని తెలిపింది. తీరం వెంబడి గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/international-news/