కరోనా నివారణా పై అధికారులకు జగన్‌ ఆదేశాలు

jagan mohan reddy
jagan mohan reddy

అమరావతి: ఏపి సిఎం జగన్‌ రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాలపై ఎక్కువగా దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ఈ జిల్లాల్లో ఎక్కువ సంఖ్యలో పరీక్షలు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో పీపీఈ కిట్లు, మాస్క్‌లను ఎక్కువ స్టాక్‌లో అందుబాటులో ఉంచినట్లు వివరించారు. రాష్ట్రంలో ప్లాస్మా థెరఫీని ప్రారంభించడానికి అనుమతి కోరినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సమగ్ర సర్వేల ద్వారా గుర్తించిన 32వేల మందిలో ఇప్పటికే 2వేల మందికి పైగా కరోనా పరీక్షలు నిర్వహించామని, మిగతావారికి కూడా పరీక్షలు నిర్వహిస్తామన్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/