నేడు కోర్టుకు హాజరుకాని సిఎం జగన్‌

కచ్చితంగా హాజరు కావాలని గతంలో పేర్కొన్న కోర్టు

AP CM Jagan
AP CM Jagan

అమరావతి: ఏపి సిఎం జగన్‌ను ఈరోజు అక్రమాస్తుల కేసులో కోర్టుకు కచ్చితంగా హాజరు కావాల్సిందేనని సీబీఐ కోర్టు స్పష్టం చేసినా ఆయన హాజరు కాలేదు. దీంతో కోర్టు తదుపరి నిర్ణయం ఏమిటన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ముఖ్యమంత్రి హోదాలో బిజీగా ఉంటున్నందున కేసులో తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో రెండుసార్లు జగన్‌ పిటిషన్‌ దాఖలు చేసినా కోర్టు వాటిని కొట్టేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు జగన్‌ ఈరోజు కోర్టుకు హాజరు కావాల్సి ఉన్నా హాజరు కాలేదు. అయితే సీబీఐ కోర్టు నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ జగన్‌ తెలంగాణ హైకోర్టులో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు కౌంటర్‌ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. అనంతరం విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది. ఈ వ్యవహారం హైకోర్టులో ఉన్నందునే జగన్‌ కోర్టుకు హాజరు కాలేదా? అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/