అన్ని ప్రాంతాల అభివృద్ధే సీఎం జగన్‌ లక్ష్యం

నారావారిపల్లెలో సభను నిర్వహించి తీరుతాం

chevireddy bhaskar reddy
chevireddy bhaskar reddy

చిత్తూరు: అన్ని ప్రాంతాల అభివృద్ధే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి లక్ష్యమని వైఎస్సార్‌సిపి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి అన్నారు. ఏపీలో ఈ రోజు అధికార వికేంద్రీకరణకు మద్దతుగా చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజక వర్గంలోని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు స్వగ్రామం నారావారిపల్లెలో వైఎస్సార్‌సిపి సభ నిర్వహిస్తుండటంతో ఉద్రిక్త వాతావరణం తెలిసిందే. అయితే ఈ సభను నిర్వహించి తీరతామని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలనే ఉద్దేశంతోనే తాము అధికార వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నామని చెవిరెడ్డి అన్నారు. ఈ సభ ద్వారా ప్రజల అభిప్రాయాలను రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తామని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని నారావారిపల్లె నుంచి తెలియజేస్తామని చెవిరెడ్డి తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/