రేపు మోడిని కలవనున్న జగన్‌

కాసేపట్లో ఢిల్లీకి బయల్దేరుతున్న జగన్

cm jagan
cm jagan

అమరావతి: ఏపి సిఎం జగన్‌ ఢిల్లీకి బయల్దేరుతున్నారు. విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన బయల్దేరుతున్నారు. రేపు ప్రధాని మోడితో జగన్ సమావేశం కాబోతున్నారు. ఈ నెల 23న కడప స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన జరగనుండగా, జనవరి 9న అమ్మఒడి పథకం ప్రారంభంకానుంది. ఈ కార్యక్రమాలకు మోడిని జగన్ ఆహ్వానించబోతున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కూడా జగన్ కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

తాజా చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/women/