సీఎం జగన్‌ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు

avanthi srinivas
avanthi srinivas

అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌ రాజధాని విషయంలో చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్‌ ప్రశంసించారు. విశాఖపట్టణంలో ఎగ్జిక్యూటివ్‌ రాజధాని పెట్టాలనుకోవడం మంచి నిర్ణయమన్నారు. జగన్‌ ఏ సామాజిక వర్గానికీ అనుకూలం కాదు, వ్యతిరేకమూ కాదని మంత్రి స్పష్టం చేశారు. రాజధాని సహా అన్ని అంశాలల్లో ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటుంటే అసూయతో చంద్రబాబు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి మండి పడ్డారు. అమరావతి ప్రాంతంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై ఆధారాలతో సహా బయటపెట్టినట్లు చెప్పారు. బినామీలు కొన్న భూముల ధరలు పడిపోతాయని ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు బాధపడుతున్నారని మంత్రి అవంతి ఎద్దేవా చేశారు. చంద్రబాబు తానా అంటే పవన్‌ కళ్యాణ్‌ తందానా అంటున్నారని విమర్శించారు. అప్పట్లో చంద్రబాబు బలవంతంగా భూములు లాక్కుంటున్నారని అన్న పవన్‌ కళ్యాణ్‌ …ఇప్పుడు మాత్రం మరోలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఇంకా చంద్రబాబు అబద్ధాలు చేప్పకపోతే బతక లేరని మంత్రి విమర్శించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/