వంట నూనె కొరతలపై కేంద్రమంత్రులకు ఏపీ సీఎం జగన్‌ లేఖలు..

cm jagan letter central ministers over reduce oil

వంట నూనెల కొరతలు ఫై కేంద్ర మంత్రులు నిర్మలా సీతా రామన్, పీయూష్‌ గోయల్‌కు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి లేఖలు రాసారు. వంటనూనెలకు కొరత ఏర్పడిన నేపథ్యంలో ఆవనూనెపై దిగుమతి సుంకం తగ్గించాలని లేఖల్లో సీఎం జగన్‌ విజ్ఞప్తి చేశారు. రష్యా – ఉక్రెయిన్‌ పరిస్థితుల దృష్ట్యా సన్‌ఫ్లవర్‌ నూనెలకు కొరత ఏర్పడిందన్నారు. ఈనేపథ్యంలో ఆవనూనె దిగుమతులపై దిగుమతి సంకాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు.

సుమారు 92 శాతం సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ను ఉక్రెయిన్, రష్యాల నుంచే దిగుమతి చేసుకుంటున్నామని లేఖలో సీఎం జగన్‌ గుర్తు చేశారు. అయితే తాజా పరిస్థితుల వల్ల ఒక్కసారిగా ప్రపంచంలో ఈ వంటనూనెలకు కొరత ఏర్పడిందని.. ఈ ప్రభావం వినియోగదారులపై పడిందని సీఎం జగన్‌ లేఖలో ప్రస్తావించారు. 2021-22లో దేశంలో వంటనూనెల వినియోగం 240 లక్షల మెట్రిక్‌ టన్నులు కాగా, ఇందులో 40శాతం మాత్రమే దేశీయంగా ఉత్పత్తి అయ్యిందని, మిగిలిన 60శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి చేసుకోవాల్సి వచ్చిందన్నారు.

దిగుమతి చేసుకుంటున్న వంటనూనెల్లో 95 శాతం పామాయిల్‌ను ఇండోనేషియా, మలేషియాల నుంచి, 92 శాతం సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ను ఉక్రెయిన్, రష్యాలనుంచి దిగుమతి చేసుకుంటున్నామని, ఉక్రెయిన్, రష్యాల్లో పరిస్థితుల వల్ల ఒక్కసారిగా ప్రపంచంలో ఈ వంటనూనెలకు కొరత ఏర్పడిందన్నారు. ఈ ప్రభావం వినియోగదారుల పై పడిందని, దీని వల్ల సన్‌ఫ్లవర్‌తో పాటు, ఇతర వంట నూనెల ధరలు పెరిగాయని, రాష్ట్రంలో మూడింట రెండొంతుల మంది సన్‌ఫ్లవర్‌నే వాడుతారని ఆయన విన్నవించారు.