రాష్ట్రంలో చెట్ల పెంపకం ఒక యజ్ఞంలా జరగాలి


జగనన్న పచ్చతోరణం..మొక్కలు నాటిన సీఎం జగన్

మంగళగిరి : ఏపీ వ్యాప్తంగా జగనన్న పచ్చ తోరణం- వన మహోత్సవం కార్యక్రమం ప్రారంభమైంది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్‌ ఆవరణలో సీఎం జగన్ మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ చెట్లను పెంచాలని సీఎం జగన్‌ ప్రతిజ్ఞ చేయించారు.

అనంతరం సీఎం మాట్లాడుతూ.. చెట్లను పెంచడం చాలా అవసరమని, చెట్ల పెంపకంతో కాలుష్యం ఉండదన్నారు. చెట్లు ఉన్న చోటే వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉంటుందని తెలిపారు. రాష్ట్ర విస్తీర్ణంలో 33 శాతం పచ్చదనం ఉండేలా చర్యలు చేపడుతున్నామన్నారు. రాష్ట్రంలో చెట్ల పెంపకం ఒక యజ్ఞంలా జరగాలన్నారు. రాష్ట్రాన్ని పచ్చతోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని సీఎం జగన్‌ పిలుపునిచ్చారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/