ఆరోగ్య శ్రీ పథకం మరింత విస్తృతం

ఆరోగ్యశ్రీ వర్తింపచేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన జగన్‌

AP CM YS JAGAN
AP CM YS JAGAN

అమరావతి: ఏపిలో అమలవుతోన్న ఆరోగ్య శ్రీ పథకాన్ని మరింత విస్తృతం చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లోని పలు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఆ ప్రాంతాల్లోనూ ఆరోగ్యశ్రీ వర్తింపచేసే కార్యక్రమాన్ని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఈ రోజు ప్రారంభించారు. అనంతరం చెన్నైలోని ఎంఐఓటీ, బెంగుళూరులోని ఫోర్టిస్ తో పాటు హైదరాబాద్‌లోని మెడ్‌కవర్‌ ఆసుపత్రుల వైద్యులతో జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అలాగే, ఆ ప్రాంతాల్లోని ఆరోగ్యశ్రీ లబ్ధిదారులతోనూ మాట్లాడారు. ఏపీకి చెందిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరారు. ఆరోగ్యశ్రీ ద్వారా 716 రోగాలకు ఆ నగరాల్లోనూ ఇకపై వైద్య సేవలు అందుతాయి.


తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/