ఏపీపీఎస్సీలో ఇంటర్వ్యూల పద్ధతి తొలగింపు

ఏపీపీఎస్సీపై సీఎం జగన్ సమీక్ష

cm jagan
cm jagan

అమరావతి: ఏపీపీఎస్సీ ద్వారా జరిగే ఉద్యోగ నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట ఏపీపీఎస్సీ నియామకాల్లో ఇంటర్వ్యూలు ఉండవు. ఏపీపీఎస్సీ పనితీరు, నియామకాలపై సీఎం జగన్ తాజాగా సమీక్ష నిర్వహించారు. ఇక నుంచి ఏపీపీఎస్సీ నియామకాల్లో ఇంటర్వ్యూ పద్ధతిని తొలగించాలని ఆయన అధికారులకు స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రావాలని ఆదేశించారు. అంతేగాకుండా, నియామకాల కోసం నిర్వహించే పరీక్షల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, పూర్తి పారదర్శకత ఉండేలా వ్యవహరించాలని స్పష్టం చేశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/