రేపు శ్రీశైలంలో సిఎం జగన్‌ పర్యటన

AP CM YS Jagan
AP CM YS Jagan

అమరావతి: రేపు ముఖ్యమంత్రి హోదాలో శ్రీశైలంలో సిఎం జగన్‌ పర్యటించనున్నారు. వానలు, వరదలతో శ్రీశైలం జలాశయం కొత్త శోభ సంతరిచుకుంది. 5 గేట్లు తెరిచి నీటిని విడుదల చేయడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు సందర్శన అనంతరం పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు టెండర్ల ప్రక్రియ తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాలపై అధికారులతో సిఎం జగన్‌ చర్చించే అవకాశముంది. త్వరలోనే అపెక్స్ కౌన్సిల్ సమావేశమున్నన నేపథ్యంలో అక్కడ లేవనెత్తాల్సిన అంశాలపై దిశా నిర్దేశం చేయనున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి 4.29 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. స్పిల్ వే ద్వారా 1.36 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఐదు గేట్లు తెరచుకోవడంతో శ్రీశైలం డ్యామ్ వద్ద కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/