జగన్‌ కులమతాలకు అతీతుడు..నారాయణస్వామి

గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొస్తున్నారు

AP Minister Narayana Swamy

అమరావతి: సిఎం జగన్‌ కులమతాలకు అతీతుడని వైఎస్‌ఆర్‌సిపి నేత, మంత్రి నారాయణస్వామి అన్నారు. వెంకటేశ్వరస్వామి, ఏసుక్రీస్తు, అల్లా ఆశీస్సులు జగన్ కు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. దళితులకు పెద్దపీట వేసిన జగన్, వారి అభ్యున్నతికి ఎంతగానో పాటుపడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితులను ఇబ్బంది పెట్టిన టిడిపి అధినేత చంద్రబాబు… ఇప్పుడు దళితులపై కపట ప్రేమ చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు.

56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి బీసీలకు జగన్ పెద్దపీట వేశారని నారాయణస్వామి చెప్పారు. ప్రతి లోక్ సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మార్చేందుకు జగన్ యత్నిస్తున్నారని తెలిపారు. మండల వ్యవస్థను ఎన్టీఆర్ బలోపేతం చేశారని, జగన్ గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలోని ప్రజలంతా వైఎస్‌ఆర్‌సిపి వెంటే ఉన్నారని తెలిపారు. జగన్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాల పట్ల ప్రజలంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో ఘన విజయం సాధిస్తామని చెప్పారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీది గతించిన చరిత్ర అని అన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/