జగన్ రైతుల వ్యతిరేకి..శైలజానాథ్

వ్యవసాయ మీటర్లను కాంగ్రెస్ అడ్డుకుంటుంది

sake sailajanath
sake sailajanath

అమరాతి: ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రైతుల జీవితాలను నాశనం చేస్తాయని ఏపి పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. ఈ బిల్లులను దేశ వ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని, రైతులు ఉద్యమిస్తున్నారని అన్నారు. రైతులకు మద్దతుగా 2 కోట్ల సంతకాల సేకరణను చేపట్టామని చెప్పారు. అయితే వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం మాత్రం ఈ చట్టాలకు మద్దతు పలికిందని విమర్శించారు. పార్లమెంటులో ఈ బిల్లులకు అనుకూలంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా సిఎం జగన్‌ పై ఆయన మండిపడ్డారు. జగన్ రైతుల పక్షపాతి కాదని… రైతు వ్యతిరేకి అని అన్నారు. ప్రధాని మెప్పు కోసం జగన్ ఆరాటపడుతున్నారని… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు పెట్టే వ్యవసాయ మీటర్లను కాంగ్రెస్ అడ్డుకుంటుందని చెప్పారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/