నిధులు రాబట్టడంలో సీఎం జగన్‌ సర్కారు ఘోర వైఫల్యం

కేంద్రం నుంచి నిధులు రాబట్టే సామర్థ్యం సీఎంలో కొరవడింది

yanamala ramakrishnudu
yanamala ramakrishnudu

అమరావతి: కేంద్రం నుంచి నిధుల రాబట్టడంలో ముఖ్యమంత్రి జగన్‌ ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందని టిడిపి నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టే సామర్థ్యం సీఎం జగన్‌లో కొరవడిందన్నారు. కేంద్రాన్ని మెప్పించి నిధులు రాబట్టడంలో ఘోరంగా వైఎస్సార్‌సిపి ప్రభుత్వం విఫలం చెందిందని దుయ్యబట్టారు. విభజన చట్టం ప్రకారం కూడా నిధులు తెచ్చుకోలేకపోయారని, దీనిపై రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి సంజాయిషీ ఇవ్వాలి అని యనమల డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌సిపి అవినీతి, అసమర్థ నిర్వాకాలతో రాష్ట్రానికి తీరని నష్టం కలిగిందని యనమల ఆరోపించారు. సీఎం జగన్‌ తుగ్లక్‌ చర్యల వల్లే కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు నిధులు కేటాయించలేదని అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/