రైతులకు సీఎం జగన్‌ గొప్ప బహుమతి ఇచ్చారు

kesineni nani
kesineni nani

అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తన జన్మదినం సందర్భంగా రాజధాని రైతులకు గొప్ప బహుమతి ఇచ్చారంటూ టిడిపి ఎంపీ కేశినాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌ ద్వారా ముఖ్యమంత్రికి జన్మదిన శుభకాంక్షలు తెలిపారు. రాజధాని లేని రాష్ట్రం కోసం ఎంతో త్యాగం చేసి 33,000 ఎకరాలు రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన రైతులకు తన జన్మదినం సందర్భంగా గొప్ప బహుమతి ఇచ్చిన సీఎం జగన్‌ గారికి హార్ధీక జన్మదిన శుభాకాంక్షలు అంటూ కేశినేని నాని ట్వీట్‌ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/