చేనేత కుటుంబాలకు ఎపి ప్రభుత్వం చేయూత

ys jagan
ys jagan

అమరావతి: ఎపి సిఎం జగన్మోహన్‌రెడ్డి బుధవారం మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో చేనేత కార్మికుల కుటుంబాలకు అందించే ఆర్థిక సాయంపై చర్చించారు. ‘వైఎస్‌ఆర్‌ చేనేత నేస్తం పేరుతో ఏటా రూ.24వేలు చొప్పు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం అమలుకు రూ.216 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఏటా డిసెంబరు 21న చేనేత కుటుంబాలకు ఈ ఆర్థిక సాయాన్ని బ్యాంకు ద్వారా అందించనున్నారు. ఒకే విడతలో రూ.24వేలు సాయం చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 90వేల కుటుంబాలకు లబ్ది చేకూరనుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/