మున్ముందు పదవిలో కేజ్రీవాల్‌కు మంచి జరగాలి

అరవింద్‌ కేజ్రీవాల్‌కు సిఎం జగన్‌ శుభాకాంక్షలు

CM Jagan and Arvind kejriwal
CM Jagan and Arvind kejriwal

అమరావతి: జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అరవింద్‌ కేజ్రీవాల్‌ నాయకత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ విజయ కేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు ఆప్‌క తిరుగులేని విజయం కట్టబెట్టారు. అయితే ఈ సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు అరవింద్‌ కేజ్రీవాల్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో, ఆప్ ప్రభంజనంపై ఏపి సిఎం జగన్ స్పందించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి, అరవింద్ కేజ్రీవాల్ కు హృదయపూర్వక శుభాభినందనలు అంటూ జగన్ ట్వీట్ చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో చిరస్మరణీయ విజయం సాధించారని కొనియాడారు. మున్ముందు పదవీకాలంలో కేజ్రీవాల్ కు అంతే మంచి జరగాలని కోరుకుంటున్నట్టు తన ట్వీట్ లో ఆకాంక్షించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/