మంత్రి పెద్దిరెడ్డిని అభినందించిన సీఎం జగన్

కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకున్న వైస్సార్సీపీ
25 వార్డుల్లో 19 వార్డులను గెలుపొందిన వైనం

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైస్సార్సీపీ జయకేతనం ఎగురవేసింది. మొత్తం 25 వార్డులకు జరిగిన ఎన్నికల్లో 19 వార్డుల్లో వైస్సార్సీపీ విజయం సాధించింది. కేవలం 6 వార్డుల్లో టీడీపీ గెలుపొందింది. ఎన్నికలకు ముందే 14వ వార్డులో వైస్సార్సీపీ ఏకగ్రీవంగా గెలుపొందింది.

ఈ నేపథ్యంలో వైస్సార్సీపీ శిబిరం ఆనందంలో మునిగిపోయింది. మరోవైపు ఈ విజయంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని సీఎం జగన్ అభినందించారు. కుప్పం ఎన్నికల ఫలితం తొలి రౌండ్ లోనే తేలిపోయింది. తొలి రౌండ్ లోనే 15 వార్డులకు గాను వైస్సార్సీపీ 13 వార్డులను కైవసం చేసుకుంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/