ఉద్యోగ సంఘాలతో చర్చల కోసం కమిటీ ఏర్పాటు: సీఎం

మంత్రులు, సజ్జల, సీఎస్ లతో కమిటీ

అమరావతి: పీఆర్సీ సమస్య పరిష్కారం కోరుతూ ఉద్యోగులు ఆందోళనలు ఉద్ధృతం చేసిన నేపథ్యంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపేందుకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేశారు. పీఆర్సీ, ఇతర అంశాలపై ఉద్యోగులతో ఈ కమిటీ సమావేశం కానుంది. ఉద్యోగులతో సంప్రదింపులు జరుపుతూ, వారికి నచ్చచెప్పేందుకు ఈ కమిటీ ప్రయత్నించనుంది. ఈ కమిటీలో పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సమాచార ప్రజాసంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ సభ్యులుగా ఉంటారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/