అలీ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్ హాజరు

అలీ పెద్ద కుమార్తె ఫాతిమా రమీజున్ వివాహం గత రాత్రి హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. ఈ వివాహ వేడుకలో సినీ ఇండస్ట్రీకి చెందిన మెగాస్టార్ చిరంజీవి – సురేఖ దంపతులు కింగ్ నాగార్జున అమల దంపతులు నటి ఏపీ మంత్రి రోజా తో పాటు టాలీవుడ్ సెలబ్రిటీలు రాజకీయ ప్రముఖులు హాజరై నూత వధూవరులని ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.

ఇక పెళ్లి వేడుకకు ఏపీ సీఎం జగన్ హాజరు కాలేదు. కానీ రేపు రిసెప్షన్‌కు హాజరు కాబోతున్నారు. సాయంత్రం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 4.55 గంటలకు గుంటూరు ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ శ్రీ కన్వెన్షన్‌కు చేరుకుంటారు. ప్రభుత్వ సలహాదారు (ఎలక్ట్రానిక్‌ మీడియా), సినీ నటుడు అలీ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.