పరవాడ గ్యాస్ లీక్ ఘటనపై సిఎం జగన్ ఆరా
బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశం

అమరావతి: సిఎం జగన్ విశాఖపట్టణం, పరవాడలోని సాయినార్ లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో జరిగిన గ్యాస్ లీక్ ఘటనపై ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. గ్యాస్ లీక్ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న కలెక్టర్, ఎస్పీలు ముందు జాగ్రత్త చర్యగా పరిశ్రమను మూసివేయించారు. గ్యాస్ లీక్ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు పోలీసులు తెలిపారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/