వీసా కోసం సిఎం జగన్‌ దరఖాస్తు

Jagan
Jagan

హైదరాబాద్‌: ఏపి సిఎం జగన్‌ ఈరోజు హైదరాబాద్‌కు వచ్చారు. ఆయన త్వరలో అమెరికా వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయన బేగంపేటలోని యూఎస్‌ కాన్సులేట్‌ ఆఫీస్‌లో అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఏపీ సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి అమెరికా వెళ్తున్నారు. ఆగస్టు 17 నుంచి 23 వరకు ఆయన కుటుంబంతో సహా అమెరికాలో పర్యటిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అమెరికా పర్యటనలో మిషిగన్ కోబో కన్వెన్షన్ సెంటర్‌లో ప్రవాసాంధ్రులతో జగన్ సమావేశం కానున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/