అమర జవాను కుటుంబానికి రూ.50 లక్షల సాయం

అమరావతి : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన యువ జవాను మనుప్రోలు జశ్వంత్‌రెడ్డి (23) వీరమరణం పొందిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. బాపట్లకు చెందిన మన జవాను జశ్వంత్ రెడ్డి దేశరక్షణ కోసం కశ్మీర్ లో ప్రాణాలు అర్పించాడని నివాళులర్పించారు. జశ్వంత్ రెడ్డి ధైర్యసాహసాలు, త్యాగం చిరస్మరణీయం అని కీర్తించారు. జశ్వంత్ రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని, ఈ కష్ట సమయంలో అతని కుటుంబానికి అండగా రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షల ఆర్థికసాయం అందజేస్తోందని సీఎం జగన్ తెలిపారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/