టెక్కలి అభ్యర్థిని ప్రకటించిన జగన్

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. సభలు , సమావేశాలు ఏర్పాటు చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీ వైస్సార్సీపీ మరింత దూకుడు పెంచింది. నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించే పనిలో పడింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుంచి పోటీ చేసే అభ్యర్థిని ప్రకటించింది. దువ్వాడ వాణికి టికెట్ కేటాయిస్తున్నట్టు పార్టీ అధికారికంగా శుక్రవారం ప్రకటించింది. ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన సీఎం వైఎస్ జగన్.. దువ్వాడ శ్రీనివాస్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. అయితే, గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో శ్రీనివాస్ తన భార్య వాణితో కలిసి జగన్‌ను కలిశారు.

టెక్కలి టికెట్‌ను తనకే ఇవ్వాలని జగన్‌ను వాణి అభ్యర్థించారు. దీంతో సీటు ఎవరికి కావాలో తేల్చుకోవాలని జగన్ వారికి సూచించారు. చివరికి వాణినే బరిలోకి దించాలని శ్రీనివాస్ కూడా నిర్ణయించడంతో అధికారిక ప్రకటన చేసింది.