మహిళలపై పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకు సీఎం జగన్‌, చంద్రబాబు మద్దతు ఇస్తున్నారు

cpi ramakrishna
cpi ramakrishna

విజయవాడ: రాజధాని కోసం అమరావతి ప్రాంత రైతులు 75 రోజులుగా ఉద్యమం చేస్తున్నా ..ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సీపీఐ నేత రామకృష్ణ విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..మహిళలపై పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వాన్ని నమ్మడమే ప్రజలు చేసిన పాపమా? అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయాన్ని గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకు మద్దతు పలుకుతున్నారని రామకృష్ణ ఆరోపించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/