ఆర్టీసి కార్మికుల పట్ల సీఎం చిన్నచూపు తగదు

సంగారెడ్డి: ఆర్టీసి కార్మికుల పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ చిన్నచూపు తగదని కాంగ్రెస్ ఎమ్మెల్యె జగ్గారెడ్డి అన్నారు. ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంతోషంగా ఉంటామనుకున్న కార్మికులకు తెలంగాణ వచ్చిన తర్వాత మన పరిపాలనే మనకు శాపమైందా అని బాధపడుతున్నారని అన్నారు. ఆర్టీసి ప్రైవేట్ పరమైతే ప్రజలు చాలా ఇబ్బంది పడతారని జగ్గారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చట్టం తేవడంతో రాష్ట్రాలకు అవకాశం ఇచ్చినట్టయిందని విమర్శించారు. ఇప్పటికైనా మనవత్వంతో కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ముఖ్యమంత్రికి సూచించారు. కార్మికుల పట్ల తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే కెసిఆర్‌కే చెడ్డ పేరు వస్తుందని అన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/