19న కేబినెట్‌ విస్తరణ

TS CM KCR
TS CM KCR

హైదరాబాద్‌: తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19న ఉదయం 11.30 గంటలకు మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని సియం కేసిఆర్‌ నిర్ణయించారు. కేబినెట్‌ విస్తరణకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. కేసిఆర్‌ నేడు గవర్నర్‌తో భేటి ఐన అనంతరం సియం కార్యాలయం నుంచి కేబినెట్‌ విస్తరణపై ప్రకటన విడుదలైంది.