వలస కార్మికులకు కూడా ఆర్థిక సాయం

కరోనా సమయంలో పేదలను సిఎం కెసిఆర్‌ ఆదుకున్నారు.. మంత్రి జగదీష్ రెడ్డి

వలస కార్మికులకు కూడా ఆర్థిక సాయం

హైదరాబాద్‌: మంత్రి జగదీష్ రెడ్డి కరోనా పరిస్థితులు, ధాన్యం కొనుగోళ్లపై కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..కరోనా సమయంలో సిఎం కెసిఆర్ పేదలను ఆదుకున్నారని మంత్రి తెలిపారు. ఎవరు కూడా ఆకలితో ఉండకుడద్దని బియ్యంతో పాటు నగదు కూడా అందజేశామని వివరించారు. వలస కార్మికులకు కూడా బియ్యం, ఆర్థిక సాయం అందించామని పేర్కొన్నారు. కాగా తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 1107కు చేరుకోగా 29 మంది మృత్యువాతపడ్డారు. కరోనా నుంచి 648 మంది కోలుకున్నారు. భారత దేశంలో కరోనా వైరస్ 53,175 మందికి సోకగా 1790 మంది మరణించారు. ఇండియాలో కరోనా నుంచి 15,393 మంది కోలుకున్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/