సీఎం కాన్వాయ్ వెళ్తుంటే ఎవరి వాహనాలనైనా ఆపుతారు

అలాంటిది తన కారును ఆపారని పవన్‌ కళ్యాణ్‌ చెప్పడం విడ్డూరంగా ఉంది

Botsa Satyanarayana
Botsa Satyanarayana

అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి కాన్వాయ్  వెళుతుంటే ఎవరి వాహనాలనైనా ఆపుతారని తన వాహనాన్ని కూడా ఆపుతారని మంత్రి బొత్స సత్యనారయణ అన్నారు. అటువంటిది జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తన వాహనాన్ని ఆపారని చెప్పడం విడ్డూరంగా ఉందని బొత్స మండిపడ్డారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీసుల దృష్టిలో ఎవరైనా ఒకటేనని అన్నారు. తమ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం చర్యలు చేపట్టిందని బొత్స సత్యనారయణ పేర్కొన్నారు. అమరావతి ప్రాంతంలో రూ.లక్ష కోట్లతో ఒకే ప్రాంతంలో రాజధాని నిర్మించాలని ప్రభుత్వం భావించడం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం ముందుగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం రాయలసీమకు నీళ్లు తీసుకెళ్లాల్సిన బాధ్యతలు ఉన్నాయని అన్నారు. కడపలో కర్మాగారాన్ని కూడా పూర్తి చేయాల్సివుందని చెప్పారు. కమీషన్లు కోసం కక్కుర్తి పడే చంద్రబాబు నాయుడులా తమ ప్రభుత్వం లేదని అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/