ఏపిలో ఫ్యాన్‌..హైదరాబాద్‌లో స్విచ్‌..ఢిల్లీలో కరెంటు!

CM Chandrababu Naidu
CM Chandrababu Naidu

తిరుపతి: చిన్నాన్న హత్యని కూడా వైఎస్‌ జగన్‌ రాజకీయాలకు వాడుకుంటున్నాడని చంద్రబాబు మండిపడ్డారు. ఆయన ఈరోజు తిరుపతిలోని తారకరామ మైదానంలో నిర్వహించిన విజయ శంఖారావం ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు పాల్గొన్నారు. విజయ ఢంకా మోగించి ఎన్నికల ప్రచార భేరిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. చిన్నాన్న హత్యకు గురైతే దోషులపై కఠిన చర్యలు తీసుకొనేలా డిమాండ్‌ చేయకుండా జగన్‌ వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో మోడి జగన్‌ సీబీఐ విచారణ కోరుతున్నారన్నారు. ఈ హత్య ఎవరు చేశారో రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలన్నారు. ఈ కేసులో దోషులు ఎంతటివారైనా కఠినంగా శిక్షిస్తామని స్పష్టంచేశారు. ప్రతిపక్ష పాత్రలో ఇలా చేస్తే ఓ పది సీట్లు ఎక్కువ గెలిస్తే రాష్ట్రాన్ని రావణ కాష్ఠం చేసే అవకాశముందని అన్నారు.ఖఅవినీతిలో పట్టుబడ్డ వ్యక్తి జగన్‌ను ఎల్లప్పుడూ కాపాడేది చౌకీదార్‌ ప్రధాని మోడి. ఏపిలో ఫ్యాన్‌ హైదరాబాద్‌లో స్విచ్‌ ఢిల్లీలో కరెంటు ఉంటుంది. ఢిల్లీ నుండి కరెంటు వస్తే హైదరాబాద్‌లో స్విచ్‌ వేస్తే ఇక్కడ ఫ్యాన్‌ తిరుగుతుంది. ఇలాంటి ఫ్యాన్‌ను ఇక్కడ తిరగనిస్తారా తమ్ముళ్లూ? అని చంద్రబాబు ధ్వజమెత్తారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/