ఏపి మహిళలకు సిఎం ఉగాది కానుక

అమరావతి: ఏపి సిఎం చంద్రబాబు ఎలక్షన్ మిషన్ 2019 పై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ఏపి ముందుగా తెలుగు వారందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు పలు పథకాలపై కీలక ప్రకటనలు చేశారు. మహిళలకు శుభవార్త చెప్పారు. ఇకనుండి ప్రతి ఏటా పసుపుకుంకుమ పథకం కింద నగదు అందజేస్తామని ఆయన తెలిపారు. రాబోయే ఐదేళ్లలో రూ.50 వేలు చొప్పున చెల్లెమ్మలకు ఇస్తామని చెప్పారు. పేదరికం నిర్మూలనకే ప్రతి ఏటా పసుపుకుంకుమ పథకాన్ని తీసుకు వచ్చినట్లు వెల్లడించారు. రైతుల ఖర్చులు తగ్గించేందుకే అన్నదాతసుఖీభవ, యువతలో భరోసా పెంచేందుకే ముఖ్యమంత్రి యువనేస్తం పథకాలు తీసుకువచ్చామని ఆయన వివరించారు. పేదల ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ వైద్యసేవ కింద రూ.5 లక్షలు అందజేస్తామని ప్రకటించారు.
మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/