జగన్‌ సమాజానికే పెనుప్రమాదం

CM Nara Chandrababu Naidu
CM Nara Chandrababu Naidu

అమరావతి: ఏపి సిఎం చంద్రబాబు ఎలక్షన్‌ మిషన్‌పనై ఈరోజు టిడిపి నేతలు, కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు రుణమాఫీ అసాధ్యమన్న వైఎస్‌ జగన్‌ ఇప్పుడు రైతులపై ప్రేమా చూపిస్తున్నారని ఆయన విమర్శించారు. జగన్ అవినీతి వల్ల వాన్‌పిక్‌కు, లేపాక్షికి వేల ఎకరాలు.. కట్టబెట్టారని, బ్రాహ్మణి స్టీల్స్‌కు కేటాయించిన 10వేల ఎకరాలు నిరూపయోగంగా మారాయని విమర్శించారు. జగన్ సమాజానికే పెనుప్రమాదంగా మారారని అన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై డ్రామాల మీద డ్రామాలు నడుస్తున్నాయని చంద్రబాబు విమర్శించారు. టిడిపి డేటా చోరీకి భారీ కుట్ర జరిగిందని, 9లక్షల ఓట్ల తొలగింపు.. ఇంకో కుట్ర అని అన్నారు. జగన్ కుట్రలకు, డ్రామాలకు అంతేలేకుండా పోయిందని చంద్రబాబు మండిపడ్డారు. ఏపీ పోలీసులు, వైద్యులపై నమ్మకం లేదన్న జగన్‌కు.. ఓట్లు మాత్రం కావాలా? అని సీఎం ప్రశ్నించారు కెసిఆర్‌ రిటన్ గిఫ్ట్‌లు అంటున్నారని, తెలంగాణ మంత్రులను ఏపీ పైకి పంపి రెచ్చగొడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/