ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు

chandrababu family
chandrababu family

అమరావతి: ఏపి సిఎం చంద్రబాబు ఉండవల్లిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, తనయుడు లోకేశ్‌, కోడలు బ్రాహ్మణి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా అందరూ ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని అన్నారు. ప్రతి ఒక్కరరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఓటు వేయడం మన బాధ్యత అని అన్నారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/