కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు సమావేశం

CM Chandrababu meeting with Union Minister Nirmala Sitharaman

న్యూఢిల్లీః ఏపి సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఈ పర్యటనలో ఆయన వరుస భేటీలతో బిజీగా ఉన్నారు. కాసేపటి క్రితమే కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు స‌మావేశ‌మ‌య్యారు. సీఎంతో పాటు కేంద్ర‌మంత్రులు పెమ్మసాని చంద్ర‌శేఖ‌ర్‌, రామ్మోహన్ నాయుడు, ఏపీ ఆర్ధికమంత్రి పయ్యావుల కేశవ్, ఎన్‌డీఏ ఎంపీలు కేంద్రమంత్రితో భేటీ అయ్యారు.

కేంద్ర బడ్జెట్‌లో ఏపీ అంశాలకు ప్రాధాన్యతనిస్తూ నిధుల కేటాయింపు చేయాలని ఆర్ధికమంత్రిని చంద్ర‌బాబు కోరారు. కేంద్ర ప్ర‌భుత్వం చేయూత‌నిచ్చి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాల‌న్నారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అనంతరం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాతో ఆయన సమావేశం కానున్నారు.